Sunday, December 22, 2024

తలపై 15 సార్లు సుత్తితో కొట్టి దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

ముంబైలో నడిరోడ్డుపై మాజీ ప్రేయసిని హతమార్చిన ప్రియుడు
ముంబై : ఆర్థిక రాజధాని ముంబైలో నడిరోడ్డుపై దారుణం చోటుచేసుకుంది. 20 ఏళ్ల రోహిత్ యాదవ్ అనే ఓ యువకుడు అందరూ చూస్తుండగానే తన మాజీ ప్రియురాలు ఆర్తి యాదవ్‌ను విచక్షణా రహితంగా సుత్తితో కొట్టి హతమార్చాడు. మంగళవారంనాడు ఉదయాన్నే ఆఫీసుకు కిక్కిరిసిన జనం నడుమ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న ఆర్తిని వెనకి నుంచి వచ్చిన రోహిత్ ఆమె తలపై గట్టిగా కొట్టాడు. దీంతో కింద పడిపోయిన ఆర్తి తలపై ఆమె శరీరం చలనం కోల్పోయే వరకు కనీసం 15 సార్లు అతి క్రూరంగా కొట్టి చంపాడు.అనంతరం ఆమె వైపు చూస్తూ ‘నన్ను ఎందుకిలా చేశావ్.. నన్ను ఎందుకిలా చేశావ్’ అని హిందీలో గట్టిగా అరుస్తూ చుట్టు పక్కల వారిని భయభ్రాంతులకు గురి చేశాడు.

ఆర్తిని కొడుతుండగా జనంలోని ఓ యువకుడు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే అతన్ని సుత్తితో బెదిరించాడు. అనంతరం ఆర్తి మృతదేహాం చుట్టూ అరుస్తూ తిరిగి సుత్తి కిందపడేసి వెళ్లిపోయాడు. అనంతరం పొలీసులు రోహిత్ యాదవ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్తిని తనను కొంత కాలం ప్రేమించి వదిలేసి, మరొకరితో ప్రేమాయాణం సాగిస్తోందని, అందుకే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అతడు చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News