Monday, December 23, 2024

వివాహితపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/శంషాబాద్: ప్రేమ పేరుతో వివాహితపై పెట్రోల్ పోసి తాను కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివాహిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. బంటారం మండలానికి చెందిన మహేష్ గౌడ్ (33) 2012లో గండీగుడా గ్రామానికి చెందిన సంధ్యతో వివాహం జరిగింది. అయితే సంసారం సజావుగా జరిగి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు.

దంపతుల మధ్య చిన్న చిన్న తగాదాల కారణంగా మూడు సంవత్సరాల నుండి సంధ్య పిల్లలను తీసుకుని గండీగుడా అమ్మగారి ఇంట్లో ఉంటుంది. అయితే ఇంటి పక్కనే అద్దెకు ఉంటున్న మహమ్మద్ అల్తాఫ్ వ్యక్తితో పరిచయం ఏర్పడి అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే ఈ మధ్య మహేష్ పెద్దల సమక్షంలో మాట్లాడి సంధ్యను ఇంటికి తెచ్చుకున్నాడు. తొండుపల్లికి వచ్చి న సంధ్యను అల్తాఫ్ పెళ్ళి చేసుకోవాలని లేదంటే హత్య చేస్తానని బెదిరిస్తూ వేధింపులకు దిగాడు. దీంతో విషయాన్ని సంధ్య మహేష్ కు తెలిపింది. ఈ కోణంలో మహేష్ అల్తాఫ్‌ను మందలించాడు. దీంతో శుక్రవారం అల్తాఫ్ మహేష్‌కు ఫోన్ చేసి మాట్లాడుకుందామని ఫోన్ చేసి పిలిచాడు.

దీంతో ఇంట్లో నుండి మహేష్ బయలుదేరడం తెలుసుకున్న అల్తాఫ్ సంధ్య ఇంటికి పెట్రోల్ బాటిల్ తో వెళ్ళి ఆమెపై పోసి తాను కూడా నిప్పు పెట్టుకున్నా డు. అయితే సంధ్య అరుపులతో ఇంట్లో నుండి బయటకు వచ్చే సరికి చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 108 వాహనంలో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అల్తాఫ్ అప్పటికే పరారయ్యాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News