Sunday, December 22, 2024

యువతి గొంతు కోసిన ప్రియుడు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః వరుసకు బావ అయిన వ్యక్తితో వెళ్లిన యువతి గొంతు కోసిన సంఘటన ఉప్పల్ ఫోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం..ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన యువతిని వరుసకు బావ అయిన లక్ష్మినారాయణతో ఆదివారం కారులో బయటికి వెళ్లింది. బయటికి వెళ్లిన తర్వాత ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో లక్ష్మినారాయణ యువతి గొంతు కోసి పరారైంది. బాధితురాలు వెంటనే తమ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకుని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఉప్పల్ పోలీసులు నిందితుడిని సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యువతి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News