Thursday, December 26, 2024

అధిక బీపీ లక్షణాలు..

- Advertisement -
- Advertisement -

దేశంలో గుండె జబ్బుల ప్రమాదం వేగంగా పెరుగుతోంది. ప్రతి సంవత్సరం గుండెపోటు, గుండె వైఫల్యం కారణంగా అనేక మంది మరణిస్తున్నారు. అయితే, గుండె జబ్బులకు చాలా కారణాలు ఉన్నాయి. వీటిలో ఒకటి అధిక రక్తపోటు. దీనిని హైపర్‌టెన్షన్ అని కూడా అంటారు. రక్తపోటు తరచుగా ఎక్కువగా ఉండే వ్యక్తులు ఈ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే హైబీపీని అదుపులో పెట్టుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం… అధిక రక్తపోటు విషయంలో ధమనులలో రక్తపోటు సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువ కాలం కొనసాగితే గుండె, మెదడు, కిడ్నీ తదితర అవయవాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుంది.

మీ బీపీ 120/80 mm Hg లేదా అంతకంటే తక్కువ ఉంటే అది సాధారణమైనదిగా పరిగణించవచ్చు. ఒకవేళ దీని కంటే ఎక్కువగా ఉంటె బీపీకి దారి తీస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య ఎవరికైనా ఉంటె వారు తమను తాము ప్రత్యేకంగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యులను ఖచ్చితంగా సంప్రదించాలి.

అధిక బీపీ లక్షణాలు

1. తలనొప్పి
2, అస్పష్టమైన దృష్టి
3. తల తిరగడం
4. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది గా ఉండడం
5. ముక్కు నుండి రక్తం కారడం
6. వికారం, వాంతులు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News