Wednesday, January 22, 2025

బడుగు బలహీన వర్గాలకు ఆశాదీపం బిఆర్ అంబేద్కర్

- Advertisement -
- Advertisement -

సంగెం: బడుగు బలహీన వర్గాలకు ఆశా దీపం డాక్టర్ బిఆర్ అంబేద్కర్‌ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని లోహిత గ్రామంలో ఏర్పాటుచేసిన నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా నడవడమే వారికి నిజమైన నివాళి అని సమాజంలో మార్పు తెచ్చేందుకు అంబేద్కర్ భావాజాలం అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడటానికి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ప్రాతిపదిక అన్నారు. యువత ఆయనను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్‌లో ఉన్నతమైన స్థానంలో ఉండాలన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేసిన కమిటీ సభ్యులు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతి జగన్మోహన్‌రావు, ఎంపీపీ కళావతి, సొసైటీ ఛైర్మన్ సంపత్, ఎంపీటీసీ దుర్గారావు, రాజు, సందీప్, రమణ, రాజుతోపాటు అంబేద్కర్ సంఘం నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News