Thursday, January 23, 2025

పాటలు లేని తొలి హిందీ సినిమా ‘ కానూన్ ’

- Advertisement -
- Advertisement -

ముంబై: ప్రముఖ నిర్మాత బి.ఆర్. చోప్రా జయంతి నేడు. ఆయన 1960లో ‘కానూన్’ అనే పాటలుండని తొలి హిందీ సినిమాను నిర్మించారు. అందులో ప్రముఖ నటులు అశోక్ కుమార్, రాజేంద్ర కుమార్, నటి నంద నటించారు. ఈ సినిమా ’జాతీయ అవార్డు’ను కూడా అందుకుంది. 1950 దశకం హిందీ సినిమాల్లో సంగీతం ప్రధానంగా ఉండేది. నాటి కాలాన్ని ‘గోల్డెన్ ఏజ్ ఆఫ్ హిందీ ఫిల్మ్ మ్యూజిక్’ అని కూడా అనేవారు. నాడు సుప్రసిద్ధ మ్యూజిక్ కంపోజర్లు శంకర్‌జైకిషన్, మదన్ మోహన్, ఓపి. నయ్యర్ వంటి వారు తమ సంగీత బాణితో ప్రేక్షకులను కట్టిపడేసేవారు. ఒకవిధంగా చెప్పాలంటే మంచి పాటలు లేని సినిమా నాడు ఆదరణకు నోచుకునేదే కాదు. ఈ నేపథ్యంలోనే నిర్మాత బి.ఆర్.చోప్రా 1960లో పాటలు లేని సినిమా తీయడానికి సాహసించారు. తాను కోరుకున్న విధంగానే ఆయన ‘కానూన్’ అనే సినిమా నిర్మించారు. అందులో నటులు అశోక్ కుమార్, రాజేంద్ర కుమార్, నటి నంద నటించారు. ఇదే పాటలు లేని తొలి హిందీ సినిమా. ఈ సినిమా కేవలం కథనంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది.

అంతకు ముందు తీసిన సినిమాలు ‘నయా దౌర్’, ‘సాధన’ వలే ‘కానూన్’ను కూడా సమాజంలోని ఓ సమస్యను తీసుకుని చిత్రీకరించారు. ఈ సినిమా ఉరిశిక్షకు సంబంధించింది. ‘కానూన్’ సినిమా ఒకరిని హత్య చేసినందుకు ఒక వ్యక్తిని ప్రశ్నించడంతో మొదలవుతుంది. నేరం రుజువైతే అతడికి ఖైదు లేక మరణ శిక్ష తప్పదు. అయితే తాను అదే నేరానికి 10 ఏళ్లు జైలు జీవితం గడిపానని నిందితుడు అంటాడు. దానికి న్యాయాధికారి దిగ్భ్రాంతికి గురవుతాడు. ఆ వ్యక్తి వేడుకుంటూనే బోనులో కుప్పకూలిపోయి చనిపోతాడు. కానీ ఈ సినిమా ఇతివృత్తంతో మనకు ఇక్కడ పనిలేదు. కానీ ఈ సినిమా ప్రేక్షకులను డైలమాకు గురిచేసింది. ‘ఒకవేళ ఎవరైనా అమాయకుడు చేయని నేరానికి శిక్షకు గురైతే ఏమిటి?’ అని ఆలోచిస్తాడు ప్రేక్షకుడు. సినిమా కథ ఇతివృత్తం ఇదే అయినప్పటికీ ఈ సినిమాలో ప్రేమ కథ కూడా ఉంటుంది. కానీ ఈ సినిమాను బి.ఆర్. చోప్రా థ్రిల్లర్‌గానే తీశారు. ‘కానూన్’ సినిమా న్యాయవ్యవస్థనే ప్రశ్నించేదిగా ఉంటుంది.

Kanoon movie on sets

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News