న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్ నియమితులయ్యారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా పదవి కాలం మే 13వ తేదీతో ముగియనుంది. ఆయన స్థానంలో ప్రధాన న్యాయమూర్తిగా గవాయ్ పేరును సంజీవ్ ప్రతిపాదించారు. దీంతో మే 14వ తేదీన గవాయ్‌తో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకారం చేయించనున్నారు.
బిఆర్ గవాయ్ పూర్తి పేరు భూషణ్ రామకృష్ణ గవాయ్. ఆయన నవంబర్ 24, 1960లో అమ్రావతిలో జన్మించారు. మార్చి 16, 1985లో బార్‌లో చేరారు. నవంబర్ 12, 2005న ఆయన హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. మే 24, 2019న సుప్రీం కోర్టుకు పదోన్నతి పొందారు. ఆయన కీలక తీర్పులు ఇచ్చిన బెంచ్‌లో సభ్యులుగా ఉన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్‌లో గవాయ్ కూడా ఒకరు. మే 14వ తేదీన ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టనున్న గవాయ్.. నవంబర్ 24, 2025 వరకూ ఆ పదవిలో కొనసాగనున్నారు.