Tuesday, December 3, 2024

విరాట్ ఆ విధంగా చేయకు: హాగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టులలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారు. తొలి టెస్టులో వర్షం కారణంగా పిచ్ బౌలింగ్‌కు అనుకూలించడంతో విరాట్, రోహిత్ బ్యాటింగ్ చేస్తుండగా చాలా ఇబ్బందులు పడ్డారు. రెండో టెస్టులో స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే పిచ్‌పై విరాట్ ఔటవ్వడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. టీమిండియా బ్యాట్స్‌మెన్లు స్పినర్లకు వికెట్లు సమర్పించుకోవడంతో భారత క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ సందర్భంగా కోహ్లీ ఔటైన తీరుపై ఆసీస్ మాజీ క్రికెటర్ బ్రాడ్ హాగ్ స్పందించారు.

విరాట్ తన భావోద్వేగాలను నియంత్రిచుకోలేకపోతున్నాడని తెలిపాడు. ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ను టీమిండియా తేలిగ్గా తీసుకుందని, విజయం నల్లేరు మీద నడకే అనుకుందన్నారు. విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడే క్రమంలోనే ఔటయ్యాడని తెలిపారు. అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టాలని ప్రయత్నంలో కివీస్ బౌలింగ్ తక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాడని చురకలంటించారు. భారీ షాట్లు కొట్టేటప్పుడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలని సూచించాడు. కోహ్లీ స్పిన్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో టెక్నిక్ మరింత మెరుగుపర్చుకోవాలని సలహా ఇచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ సౌథీ బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డాడని, సిరీస్ క్లీన్‌స్వీప్ కావాలంటే ఇద్దరు బ్యాటింగ్‌లో రాణించాల్సిందేనని హాగ్ స్పష్టం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News