Sunday, December 22, 2024

పాండ్య లేకపోయినా గుజరాత్‌కు నష్టం లేదు: బ్రాడ్ హాగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఐపిఎల్‌లో 2024 మార్చి 22 నుంచి అంగరంగా వైభవంగా ప్రారంభంకానుంది. ఐపిఎల్‌ అంటేనే సిక్స్‌ల మోత కనిపిస్తుంది. ఐపిఎల్ లో క్రికెట్ అభిమానుల పండుగ చేసుకుంటున్నారు. ఐపిఎల్ -2024 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడనుంది. గుజరాత్ టైటాన్స్‌కు హార్దిక్ పాండ్య కెప్టెన్‌గా వ్యవహరించడంతో రెండు సార్లు ఫైనల్‌కు చేర్చాడు. ఒక సారి ఆ జట్టుకు కప్ అందించాడు. ఈ సారి మాత్రం గుజరాత్ టైటన్స్ జట్టును వదిలి హార్దిక్ పాండ్యా ముంబయి ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు. గుజరాత్‌ను పాండ్యా వీడటంపై ఆసీస్ మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ స్పందించాడు.

గుజరాత్ జట్టులో హార్దిక్ లేకపోవడంతో పెద్దగా నష్టం జరగదని తెలియజేశారు. పాండ్య మిడిల్ ఆర్డర్ నాణ్యమైన ఆల్‌రౌండర్ అని, కానీ ఎలాంటి సందేహం లేదని, హార్దిక్ పూడ్చుకోగల సామర్థం గుజరాత్‌కు ఉందని స్పష్టం చేశారు. టాప్ అర్డర్‌లో హర్దిక్ బ్యాటింగ్ చేయడం మంచిది కాదని హితువు పలికారు. గుజరాత్ జట్టు వద్ద బలమైన బౌలింగ్ దళం ఉందని, ఆయన లేకపోయిన తమ జట్టు బలంగా ఉందని బ్రాడ్ స్పష్టం చేశారు. ముంబయి ఇండియన్స్ తరపున పాండ్యా మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయడం మంచిదని సూచించారు. ముంబయి తరపున అతడు అత్యుత్తమ బ్యాటింగ్, బౌలింగ్ చేయాలని తాము భావిస్తున్నామన్నారు. ఐపిఎల్ 2024లో ముంబయి ఇండియన్స్‌కు పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ముంబయి జట్టులో స్టార్ ఆటగాళ్లు ఉన్నారని, అతడు వాళ్లతో జట్టును ఎలా నడిపిస్తారో వేచి చూడాలని బ్రాడ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News