Friday, January 17, 2025

‘బ్రహ్మా ఆనందం’లో అందరూ గొప్పగా నటించారు: బ్రహ్మానందం

- Advertisement -
- Advertisement -

మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాలతో 100 శాతం సక్సెస్ రేటుని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్. ఈ ప్రొడక్షన్ నుంచి నుంచి రానున్న నాలుగో సినిమా ‘బ్రహ్మా ఆనందం’. హాస్య బ్ర హ్మ పద్మశ్రీ అవార్డ్ గ్రహీత బ్రహ్మానందం, ఆయ న కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వ ర్య హోలక్కల్ హీరోయిన్లుగా నటించారు. సావి త్రి, ఉమేష్ కుమార్ సమర్పకులుగా డెబ్యూ డైరెక్టర్ ఆర్.వి.ఎస్.నిఖిల్ దర్శకత్వంలో రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు గురువారం నాడు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ‘పద్మశ్రీ’ బ్రహ్మానందం మాట్లాడుతూ “బ్రహ్మా ఆనందం చిత్రానికి నిర్మాత రాహుల్ మెయిన్ పిల్లర్. వరుసగా మూడు హిట్లు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సెట్లో ప్రతీ పని దగ్గరుండి చేసుకుంటారు. నిఖిల్ వచ్చీ రావడంతోనే లెన్షన్ పడుతూ కాస్త తేడాగా కనిపించాడు.

మీ కోసం, మీ పేరు మీదే సినిమా కథను రాసుకున్నాను అని, మీరు ఒప్పుకోకపోతే సినిమాను చేయను అని కాస్త తడబడుతూ చెప్పాడు. హీరో ఎవరు? అని అడిగా. రాజా గౌతమ్ అని చెప్పారు. సరదాగా, నవ్వుతూ షూటింగ్ చేశాం. ‘బ్రహ్మా ఆనందం’ చిత్రంలో అందరూ గొప్పగా నటించారు”అని అన్నారు. నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ “బ్రహ్మా ఆనందం అనే సినిమాను బ్రహ్మానందంతో చేయడం మామూలు విషయం కాదు. నిఖిల్ ఈ కథను చెప్పినప్పుడు.. చేస్తే బ్రహ్మానందంతో చేయాలని అనుకున్నాం. రాజా గౌతమ్ చాలా సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తారు. సినిమా చూస్తే అందరికీ ఆ విషయం అర్థం అవుతుంది. ముగ్గురు హీరోయిన్లు అద్భుతంగా నటించారు”అని తెలిపారు. డైరెక్టర్ ఆర్.వి.ఎస్.నిఖిల్ మాట్లాడుతూ “బ్రహ్మానందం కోసమే ఈ కథను రాశాను. ఆయన లేకపోతే ఈ చిత్రం లేదు.. నేను లేను. వెన్నెల కిషోర్ ఈ చిత్రానికి బ్యాక్ బోన్‌గా నిలిచారు. హీరో రాజా గౌతమ్ అద్భుతంగా నటించారు”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజా గౌతమ్, వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, మితేష్, శాండిల్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News