Thursday, February 20, 2025

ఓ మంచి సినిమా చేశాము

- Advertisement -
- Advertisement -

మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హ్యాట్రిక్ హిట్ల తరువాత స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ‘బ్రహ్మా ఆనందం’ అనే చిత్రం ఫిబ్రవరి 14న వచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంలో ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించారు. సావిత్రి, ఉమేష్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. నూతన దర్శకుడు ఆర్‌విఎస్ నిఖిల్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రానికి ఆడియెన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ క్రమంలో శనివారం నాడు చిత్రయూనిట్ సక్సెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డా.బ్రహ్మానందం మాట్లాడుతూ..“బ్రహ్మా ఆనందం సినిమాను చూసిన వారంతా మా అబ్బాయి గురించే మాట్లాడుతున్నారు.

మీ కన్నా.. మీ అబ్బాయి బాగా చేశాడని మెచ్చుకుంటూ ఉంటే తండ్రిగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. కొత్త పాత్రలను చేయాలనే ఎప్పుడూ కోరుకుంటాను. నన్ను అభిమానించే ఆడియెన్స్‌కు ఏదైనా కొత్తగా అనిపించాలనే ఉద్దేశంలోనే సినిమాను చేస్తుంటాను. చాలా కాలం తరువాత ఓ మంచి సినిమాను, మంచి పాత్రను చేశాననే సంతృప్తి కలిగింది”అని అన్నారు. హీరో రాజా గౌతమ్ మాట్లాడుతూ బ్రహ్మా ఆనందం సినిమాను చూసిన వారంతా నా గురించి మాట్లాడుతుండడం ఆనందంగా ఉందని తెలియజేశారు.

నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. “నేను నిర్మించిన గత చిత్రాలు మంచి మౌత్ టాక్‌తోనే హిట్ అయ్యాయి. ఈ మూవీకి మంచి మౌత్ టాక్ వచ్చింది. ఇప్పటి వరకు అన్ని చోట్లా షోలు ఫుల్ అవుతున్నాయి” అని తెలిపారు. దర్శకుడు ఆర్.విఎస్.నిఖిల్ మాట్లాడుతూ.. “బ్రహ్మా ఆనందం విషయంలో అందరూ హ్యాపీగా ఉన్నారు. థియేటర్‌కు వెళ్లి ఆడియెన్స్‌తో కలిసి సినిమాను చూశాం. మేం ఊహించని సీన్లలో కూడా నవ్వుతున్నారు”అని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News