Saturday, November 23, 2024

“బ్రహ్మచారి” ఆడియో, టీజర్ విడుదల

- Advertisement -
తెలంగాణ ఉద్యమనేత, యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ “బ్రహ్మచారి” ఆడియో, టీజర్ ను విడుదల చేశారు. దుబాయ్ కి వెళ్లి వచ్చిన ఒక అబ్బాయి పెళ్లి చేసుకుందామనుకున్న టైంలో  అమ్మాయి దొరకక  ఎలాంటి  ఇబ్బందులు ఎదుర్కున్నాడు ? చివరి కేం జరిగింది అనేదే ఈ కథ. “అద్వితీయ ఎంటర్టెయినర్స్  పతాకంపై గుంట మల్లేశం, సిరి, స్వప్న నటీ, నటులుగా నర్సింగ్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ బి రాంభూపాల్ రెడ్డి నిర్మిస్తున్న పక్కా తెలంగాణ కామెడీ చిత్రం “బ్రహ్మచారి”. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సందర్బంగా తెలంగాణ ఉద్యమనేత, కవి, గాయకుడు, యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. చిత్ర ఆడియో & టీజర్ ను దేశపతి  విడుదల చేశారు.
అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో  యం. యల్. సి దేశపతి శ్రీనివాస్ మాట్లాడారు.
తెలంగాణా జీవితాల్లో  వెలికి తీసి ప్రదర్శించే అటువంటి కథలు మన తెలంగాణ లో ఉన్నాయని, అవి కల్చరల్ , హిస్టారికల్, మానవ జీవితానికి  సంబందించిన అంశాలు  ఇలా ఏవైనా కావచ్చు చాలా కథలు ఉన్నాయని, అవి ఇప్పుడు ప్రారంభమయ్యాయి అని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ కు సంబందించిన టెక్నిసియన్స్, యాక్టర్స్ రావడం శుభపరిణామం అని చెప్పవచ్చని, దర్శకుడు  నర్సింగ్ మంచి రైటర్  తను రాసుకున్న కథ వాస్తవానికి చాలా దగ్గరగా ఉందని తెలిపారు. తను ఇలాంటి మంచి కథలతో సినిమాలు తీసి దర్శకుడుగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. వ్యాపార రంగంలో   సక్సెస్ అయిన నిర్మాత రాంభూపాల్ రెడ్డి  ఇపుడు సినిమారంగంలో కూడా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం  సాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పేర్కొన్నారు.
చిత్ర నిర్మాత బి. రాంభూపాల్ రెడ్డి ,మాట్లాడుతూ.. చిన్నప్పుడు రవీంద్ర భారతి లో తన నటనకు ఎన్టీఆర్ గారితో  బాహుమతి తీసుకోవడం జరిగిందని గుర్తు చేశారు. సినిమాలకు దూరంగా ఉన్న తనకు  దర్శకుడు  చెప్పిన కథ  వాస్తవానికి ఎంతో దగ్గరగా ఉండడమే కాకుండా  ప్రస్తుతం తెలంగాణ లో బ్రహ్మాచారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే కథ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. ఫుల్ అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందన్నారు. మా సినిమాను సపోర్ట్ చేస్తే ఇంకా ఇలాంటి మంచి సినిమాలు ఎన్నో తీయడానికి సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
చిత్ర దర్శకుడు నరసింగ్  మాట్లాడుతూ…ప్రతి సమస్య కు మా గురువు గారు  దొరవేటి పరిష్కొరం చూపారని, రిలీజ్ చేస్తానా లేదా అనుకున్న టైంలో మా ప్రొడ్యూసర్ రాంభూపాల్ ముందుకు వచ్చి సపోర్ట్ గా నిలిచారని, సినిమా షూటింగ్ పూర్తి చేశామని, త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నామని పేర్కొన్నారు. సినిమా తీయడం తమ వంతు అయితే , మీడియా, ప్రేక్షకులు సపోర్ట్ చేస్తే ఇపుడు తాము తీసిన ఈ సినిమా మరో బలగం సినిమా అవుతుందన్నారు. ఇందులో నటించిన వారు అందరూ చాలా బాగా నటించారని, అందరూ సపోర్ట్ చేయడంతో సినిమా  బాగా వచ్చిందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న అవుట్ & అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ “బ్రహ్మచారి”  చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు.
చిత్ర హీరో గుంట మల్లేశం మాట్లాడుతూ… ఇది తన మొదటి చిత్రం అని,  తెలంగాణకు సంబందించిన ఇలాంటి మంచి కథ ఉన్న చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
చిత్ర హీరోయిన్స్ సిరి, స్వప్న  మాట్లాడుతూ..  ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు.
 నటీ నటులు
గుంట మల్లేశం, సిరి, స్వప్న  తదితరులు
సాంకేతిక నిపుణులు
బ్యానర్ : అద్వితీయ ఎంటర్టెయినర్స్,
నిర్మాత : బి. రాంభూపాల్ రెడ్డి ,
స్టోరీ , స్క్రీన్ ప్లే ,  డైరెక్షన్ : నర్సింగ్ ,
సినిమాటోగ్రఫీ ; కర్ణ ,
డైలాగ్స్ అండ్ లిరిక్స్ : దోరవేటి ,
మ్యూజిక్ : పాండురంగ,
 బి. జి. యం : ఎల్. ఎం. ప్రేమ్ ,
కొరియోగ్రఫీ :  రజాక్
కో ప్రొడ్యూసర్స్ : చిట్టిబాబు, హస్సన్ జావిద్
ఆర్ట్ డైరెక్టర్ : నరేందర్
ఎడిటర్ : సాయి ఆకుల విజయ్
స్టంట్స్ : ఖురేషీ
ప్రొడక్షన్ మేనేజర్ : భాస్కర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ తెలంగాణ ఉద్యమనేత, యం.యల్. సి దేశపతి శ్రీనివాస్ చేతుల మీదుగా గ్రాండ్ గా రిలీజైన బ్రహ్మచారి” ఆడియో & టీజర్
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News