Monday, December 23, 2024

బ్రహ్మకుమారీస్ కల్పతరువు -2 ప్రారంభం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బ్రహ్మకుమారీలు కల్వతరువు పేరిట మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు. యోగా, ఆధ్యాత్మికతను ప్రజలకు చేరువ చేస్తున్న బ్రహ్మకుమారీ సమాజం ప్రారంభించిన మొక్కలు నాటే కార్యక్రమం కల్పతరువు రెండో సీజన్‌ను ఆదివారం గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతిసరోవర్‌లో సంతోష్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మేం మొక్కలు నాటే కార్యక్రమం విస్తృతంగా చేస్తుంటే.. మరోవైపు బ్రహ్మకుమారీలు సైతం కల్వతరువు పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని తీసుకోవడం.. దాని మొదటి దశను తానే ప్రారంభించడం.. రెండో దశ కూడా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భిన్నరంగాల్లో ఉన్నప్పటికి సమాజం బావుండాలనే ఆశయం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మేము, కల్పతరువు ద్వారా బ్రహ్మకుమారీలు చేస్తుండటం భగవంతుడి సంకల్పంగా భావిస్తున్నాను. కల్పతరువు- 1లో 16 లక్షల మొక్కలు నాటడం వారి సంకల్పశక్తికి నిదర్శనం అన్నారు. కల్పతరువు- 2లో వారు అంతకు మించి మొక్కలు నాటాలని మనస్పూర్తిగా ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం బ్రహ్మకుమారీస్ మాత కుల్దీప్ దీదీ మాట్లాడుతూ జోగినిపల్లి సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మొక్కలు నాటడం, ప్లాస్టిక్ నిర్మూలనకు పాటు పడటం, మొక్కలు నాటే అరుదైన వ్యక్తులను గుర్తించి అండగా నిలవడం వంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు కార్యనిష్టతో నిర్వహిస్తున్నారు. ఒక ఋషిలా నిరంతరం ప్రకృతి పరిరక్షణ కోసం పరితపిస్తున్నారు. అందుకే వారి మంచి ఆశయాలు చూసి బ్రహ్మకుమారీ సమాజంలో ఐదు సంవత్సరాల సేవ తర్వాత అందించే బ్యాడ్జీని ఈ రోజే సంతోష్ కుమార్‌కు అందిస్తున్నట్లు కరతాళధ్వనుల మధ్య ఆమె ప్రకటించారు. కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ కుటుంబసభ్యులు, రాజయోగులతో పాటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ మెంబెర్స్ కరుణాకర్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
2 వేల మొక్కలు నాటిన ముఖరా కె వాసులు
ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ జన్మదినం సందర్బంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో 2వేల మొక్కలను ముఖరా కె గ్రామస్తులు నాటారు. ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా మంత్రి కెటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా 2000 మొక్కలు నాటి 100 శాతం బ్రతికిస్తామని గ్రామస్తులు ప్రమాణం చేశారు. మంత్రి కెటిఆర్ జన్మదినం పురస్కరించుకొని ప్రతి యేటా గ్రామంలో మొక్కలు నాటుతున్నారు, మంత్రి కెటిఆర్ ప్రతి జన్మదినం సందర్భంగా 2వేల మొక్కలు నాటుతున్నారు. ఇప్పటి వరకు మొత్తం పది వేల మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా గ్రామంలో ఇప్పటి వరకు లక్ష మొక్కలు నాటి వంద శాతం రక్షిస్తూమని సర్పంచ్ గాడ్గే మీనాక్షి తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గాడ్గే సుభాష్, ఉపసర్పంచ్ వర్ష, మాధవ్, వెంకట్, సంజీవ్ గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News