Thursday, January 23, 2025

దేశానికే ఆదర్శంగా బ్రహ్మణ సంక్షేమ భవన్

- Advertisement -
- Advertisement -
  • బ్రహ్మణ బంధువులు సిఎం కెసిఆర్, మంత్రి హరీశ్‌రావు
  • బ్రహ్మణ పరిషత్ భవనం ప్రారంభోత్సవం విజయవంతం చేయాలి

సిద్దిపేట: దేశానికే ఆదర్శంగా బ్రహ్మణ సంక్షేమ భవన్ అని సిద్దిపేట జిల్లా అర్చక ఉద్యోగుల సంఘం నాయకులు కలకుంట్ల కృష్ణమాచార్యులు, కలకుంట్ల వెంకట నరసింహచార్యులు, చంద్రకుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 31న గోపన్ పల్లి రంగారెడ్డి జిల్లా నందు 12 కోట్ల రూపాయలతో నిర్మించిన బ్రహ్మణ పరిషత్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో సిఎం కెసిఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రహ్మణులకు ప్రతి సంవత్సరం బడ్జెట్‌లో 100 కోట్లు కేటాయించే విధంగా బ్రహ్మణ పరిషత్ ఏర్పాటు చేశారన్నారు.

కార్పొరేషన్ ద్వారా బ్రహ్మణులకు విద్యరుణాలు, వ్యాపార రుణాలు ఇస్తున్నట్లు తెలిపారు. అర్చక ఉద్యోగులకు 2017 సెప్టెంబర్ 15 న ప్రగతి భవన్ సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభుత్వ ఉద్యోగులు మాదిరిగా వేతనాలుఅమలు చేస్తారని వివరించారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ వ్యవస్థ ద్వారా అర్చక ఉద్యోగులకు వేతనములు అర్చక ఉద్యోగులకు చెల్లిస్తున్నారు. అలాగే ప్రతి గ్రామంలో అర్చకులకు దూప దీప నైవేద్యం ద్వారా నెలకు రూ. 6 వేలు చెల్లిస్తున్నారని తెలిపారు. భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి అర్చక ఉద్యోగులు, బ్రహ్మణ బందువులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. అదే విధంగా సిఎం కెసిఆర్, మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకిరణ్‌రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్చక కార్యదర్శి సిహెచ్ వెంకట నరసింహ చార్యులు, రాజు పంతులు, మహేశ్ పంతులు, శ్రీకాంత్‌రెడ్డి, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News