Monday, December 23, 2024

పాతికేళ్ల తరువాత సరేనన్న బ్రహ్మానందం!

- Advertisement -
- Advertisement -

కామెడీ కింగ్ బ్రహ్మానందం ఉన్నాడంటే ఆ సినిమా హిట్టే! ఆమాటకొస్తే నిన్న మొన్నటివరకూ బ్రహ్మానందం లేకుండా తెలుగు సినిమా ఉండేది కాదు. ఆయన ఉంటే సినిమా ఈజీగా మార్కెట్ అవుతుందని నిర్మాతలకు నమ్మకం. దాదాపు 1200 సినిమాల్లో నటించి గిన్నెస్ బుక్ లోకి ఎక్కిన బ్రహ్మానందం, కొంతకాలంగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. వచ్చిన ఆఫర్లన్నీ అంగీకరించకుండా పాత్ర బాగుంటేనే నటిస్తున్నారు. ఇటీవల కీడాకోలా మూవీలో బ్రహ్మీ కనిపించారు. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’లోనూ, ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీలోనూ ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది.

తాజాగా బ్రహ్మానందానికి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పాతికేళ్ల తర్వాత మళ్లీ ఆయన ఓ హిందీ మూవీలో నటిస్తున్నారట. గురు రణ్ ధావే, సాయి మంజ్రేకర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘కుచ్ ఖట్టా హో జాయ్’ అనే మూవీలో నటించేందుకు బ్రహ్మీ ఒప్పుకున్నారని టాక్. గతంలో అమితాబ్ నటించిన సూర్యవంశం మూవీలో బ్రహ్మీ కూడా నటించారు. ఆ తర్వాత మళ్లీ ఓ బాలీవుడ్ మూవీకి ఓకే చెప్పడం ఇదే మొదటిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News