Monday, December 23, 2024

బ్రహ్మానందంలో మరో టాలెంట్….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బ్రహ్మానందం పేరు వినగానే నవ్వొస్తుంది తెలుగు ప్రజలకు. ఆయన దాదాపుగా 1000కి పైగా సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. టాలీవుడ్‌లో హాస్యనటుడు ఎవరు అనగానే మొదటి పేరు గుర్తుకు వచ్చేది బ్రహ్మానందం. గత 40 సంవత్సరాల నుంచి సినిమాల్లో నటిస్తూ తెలుగువారిని నవ్విస్తున్నారు. ఆయన వయసు 67 సంవత్సరాలు కావడంతో సినిమాల్లో నటించడం తగ్గించేశాడు. లాక్‌డౌన్ టైమ్‌లో దేవుడి చిత్రాలను చేతులతో గీసి హీరోలకు బహుమతిగా ఇచ్చారు. అప్పుడు బ్రహ్మానందానికి మరో టాలెంట్ బయటపడింది. ఇప్పుడు ఏకంగా ఆయన రైటర్ ఉన్నాడని తెలిసింది. తన జీవితాన్ని పుస్తకంగా రాసి ప్రచురించాడు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

తనకు అత్యంత ఆప్తుడు, దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులందరికీ మహదానంద కారకుడు అయిన మనందరి బ్రహ్మానందం, ఆయన 40 సంవత్సరాల సినీ ప్రస్థానంలో అనేక మంది వ్యక్తులను కలిసి, పరిచయాలతో తెలుసుకున్న విషయాలు, దృష్టికోణాలు, తనకెదురైన ఎన్నో ఎన్నెన్నో జీవితానుభవాలను రంగరించి, క్రోడీకరించి ఒక ఆత్మకథగా ‘నేను’ అనే పుస్తకరూపంలో మనకందిoచటం ఎంతో ఆనందదాయకం అని ప్రశంసించారు. బ్రహ్మీ చెప్పినట్టు ‘ఒకరి అనుభవం, మరొకరికి పాఠ్యాంశం అవ్వొచ్చు , మార్గదర్శకము అవ్వొచ్చని చిరంజీవి సూచించారు. ఈ పుస్తకం చదివే  ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని కలిగిస్తుందని నమ్ముతూ, ఈ  పుస్తకాన్ని రాసిన బ్రహ్మానందంకి మనస్పూర్తిగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ పుస్తక  ప్రచురణ కర్తలయిన  ‘అన్వీక్షికి’ వారిని అభినందిస్తున్నాను.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News