Monday, December 23, 2024

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బ్రహ్మానందం

- Advertisement -
- Advertisement -

కర్ణాటక ఎన్నికల రణరంగం వేడెక్కుతున్న తరుణంలో రాజకీయ పార్టీల నేతలు, మద్దతుదారులు తమ ప్రత్యర్థులను గెలిపించేందుకు విస్తృతంగా ప్రచారం చేపట్టారు. కొందరు ప్రచార సారధులుగా చురుగ్గా తిరుగుతుంటే.. మరికొందరు ప్రజలకు సేవ చేస్తామని హామీలు గుప్పిస్తూ ఓట్లు అడుగుతున్నారు. ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు సినీ తారలు సైతం రంగంలోకి దిగారు. వీరిలో టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ఇప్పుడు కన్నడ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

బ్రహ్మానందం ఇటీవల చిక్కబళ్లాపూర్‌లో బీజేపీ అభ్యర్థి సుధాకర్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొని, నియోజకవర్గంలో చాలా మంది తెలుగు మాట్లాడేవారు ఉండటంతో ప్రజలతో మమేకమై తెలుగులో మాట్లాడారు. నటుడు ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్‌కు తన మద్దతునిచ్చాడు. అతని కోసం చిక్కబల్లాపూర్‌లో ప్రచారం చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News