Monday, December 23, 2024

భారతీయుడు-2 లో బ్రహ్మానందం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఇప్పుడిప్పుడే మళ్ళీ పలు చిత్రాల్లో కనిపించడం ప్రారంభించారు. అయితే తనకి తగ్గ మంచి పాత్రలు తక్కువే వస్తున్నాయి అనే టాక్ కూడా ఉంది. కానీ తాజాగా కీడా కోలా చిత్రంలో బ్రహ్మి మళ్ళీ కాస్త ఎక్కువ సేపు అలరించను న్నారు. అయితే ప్రేక్షకుల్లో బ్రహ్మానందంకు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ప్రేక్షకులకు సూపర్ కిక్ ఇచ్చే న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం భారతీయుడు2లో కూడా బ్రహ్మానందం నటించనున్నారుని తెలిసింది. శంకర్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్‌లో బ్రహ్మానందం కూడా నటించనున్నారని ఖరారైంది. అయితే ఈ చిత్రంలో బ్రహ్మి ఎలాంటి రోల్‌లో కనిపించనున్నారో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News