Wednesday, January 22, 2025

ఆర్‌బిఐ క్విజ్ పోటీలో బ్రాహ్మణపల్లి విద్యార్థుల విజయం

- Advertisement -
- Advertisement -

బోనకల్ : ఆర్‌బిఐ ఆధ్వర్యంలో మండల స్దాయిలో నిర్వహించిన క్విజ్ పోటీలో బోనకల్ మండలం బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న గుడిద అఖిల, 9వ తరగతి చదువుతున్న గుడిదె ఉమశ్రీలు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొంది రూ.4000ల నగదు బహుమతి పొందారు.

క్విజ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయులు సుగ్గల రామకృష్ణారావు, ప్రాధమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోతు రామకృష్ణ, ఎస్‌ఎంసీ చైర్మన్ మడుపల్లి రమేష, సర్పంచ్ జెర్రిపోతుల రవీంద్ర, ఉపసర్పంచ్ పారుపల్లి కరుణ, ఎంపిటిసి చేపూరి సునీత అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News