Monday, January 20, 2025

బ్రాహ్మణవెల్లెంల గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తా

- Advertisement -
- Advertisement -

నార్కెట్‌పల్లి: బ్రహ్మణ వెల్లెంల గ్రామాన్ని మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే లక్షం అని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. నార్కెట్‌పల్లి మండ లంలోని బ్రాహ్మణ వెల్లెంల గ్రామంలో రూ1.20 కోట్లతో నిర్మించనున్న సిసిరోడ్లు, డ్రై నేజిలు, పలు ఆత్మగౌరవ భవనాలకు ఆదివారం జెడ్పీ చైర్మన్ బండ నరేందర్‌రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సిఎం కెసిఆర్ సహాయ సహకారాలతో బ్రాహ్మణ వెల్లెంల గ్రామాన్ని అన్నిటిలో అగ్రగామిగా నిలపుతానని అన్నారు. పుట్టిన ఊరు కన్న తల్లిలాంటిదని ఊరి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ తోడుగా ఉంటానని అన్నారు.

ఆత్మగౌరవ భవనాలకు రూ.1కోటి నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఊరుకి నలువైపులా బిటి రోడ్డు నిర్మాణం చేపడతామన్నారు. సిసరోడ్లు ,డ్రైనేజిలు ,పలు మట్టి రోడ్ల పనుల నిర్మాణానికి రూ.3.56 కోట్లు మంజూరు చేశామని ,అదేవిదంగా మన ఊరు మన బడి ద్వారా పాఠశాల మరమ్మతులు , ప్రైమరీ సబ్ సెంటర్ నిర్మాణం,పద్మశాలి ,గౌడ సంఘం భవనాలకు,ఎస్పీ కమ్యూనిటీ హాల్ నిర్మాణాలతో పలు అభివృద్ధ్ది పనులకు నిధులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధ్ది జరుగుతుందని, సిఎం కెసిఆర్‌కు , బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెగట్టె మల్లికార్జున్‌రెడ్డి, స్థానిక ఎంపిపి సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ యానాల మాధవి అశోక్ రెడ్డి , ఎంపిటిసి చిరుమర్తి యాదయ్య, పలువురు ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News