Thursday, January 23, 2025

‘బ్రహ్మాస్త్ర’  ట్రైలర్ విడుదల

- Advertisement -
- Advertisement -

 ముంబయి: ‘బ్రహ్మాస్త్ర’  సినిమా ట్రైలర్ ను బుధవారం ఉదయం విడుదల చేశారు. బ్రహ్మాస్త్ర మూవీని మూడు భాగాలు విభజించి విడుదల చేయబోతున్నారు. మొదటి భాగం “బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ ” అనే పేరుతో విడుదల కానుంది.  భారీ ఫాంటసి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాలీవుడ్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఈ సినిమా తెలుగులో ‘బ్రహ్మాస్త్రం’గా రిలీజ్ కానుంది. రాక్ స్టార్ రణబీర్ కపూర్, అలియాభట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్‌తో పాటు టాలీవుడ్ కింగ్ నాగార్జున ‘నంది అస్త్ర’ అనే శక్తి ఉన్న అనీష్ శెట్టి పాత్రలో కనిపించనున్నారు. ఈ ట్రైలర్ లో ముఖ్యంగా నీరు, నిప్పు, గాలి కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని అస్త్రాలలో ఇమిడి ఉన్నాయి, ఈ కథ అస్త్రాలన్నిటికి అధిపతి అయినా బ్రహ్మాస్త్రానిదని అనే డైలాగులు బాగున్నాయి.  రణబీర్ కపూర్, అలియ భట్ ప్రేమాయణం నడిపిస్తూనే మరో వైపు శివ, నంది అస్త్రంగా (నాగార్జున) దృష్ట శక్తులతో పోరాటం చేస్తారు. ” ఇషా నేను నిప్పులో కాలను, నిప్పుతో నాకు అనుబంధం ఉంది, నిప్పు నన్ను కాల్చలేదని” అనే డైలాగులు సినిమా ట్రైలర్ కు హైలెట్ గా ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News