Wednesday, January 22, 2025

సమాజ హితమే బ్రాహ్మణ మతం: ఎమ్మెల్సీ యాదవ రెడ్డి

- Advertisement -
- Advertisement -

గజ్వేల్: వేద శాస్త్ర పండితులకు సిఎం కెసిఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని సముచి త గౌరవం ఇస్తున్నారని మెదక్ ఎమ్మెల్సీ డా.యాదవ రెడ్డి, ఎఫ్‌డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, స్థానిక మున్సిపల్ ఛైర్మన్ ఎన్సీ రాజమౌళి గుప్తాలు అన్నారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయ సమావేశ మందిరంలో ఉమ్మడి మెదక్ జిల్లా స్థాయిలో బ్రాహ్మణ,ఆర్చకుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనానికి ముఖ్యఅతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ వేద శాస్త్ర పండితులకు ధూప,దీప నైవేద్య పధకం కింద రాష్ట్రంలోని 6441 ఆ లయాలలోని అర్చకులకు రూ10వేల గౌరవ వేత నం అందిస్తున్నదన్నారు. బ్రాహ్మణ పరిషత్ ద్వారా వేదశాస్త్ర పండితులకు రూ.5వేల గౌరవ వేతనం అందచేస్తున్నదని, అలాగే పేద బ్రాహ్మణులకు ప్ర భుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వారు తెలిపారు.

ముఖ్యంగా వేద పాఠశాలల నిర్వహణకు ప్రబుత్వం చొరవ చూపుతూ వార్షిక గ్రాంటుగా రూ.2లక్షలు అందచేస్తున్నదని తెలిపారు. హైదరాబాద్ శివారులోని గోపన పల్లిలో 9 ఎకరాల విస్తీర్ణంలో రూ.12 కోట్ల వ్యయంతో బ్రాహ్మణ భవన్, బ్రాహ్మణ సదనం ఏర్పాటు చేసి తగిన ప్రోత్సాహం అందిస్తున్నదన్నా రు. ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక కార్యక్రమాలకు కేం ద్ర బిందువులుగా మారాలని వారు బ్రాహ్మణులు, అ ర్చకులను కోరారు. సమాజాన్ని సన్మార్గంలో నడిపిం చే సత్తా బ్రాహ్మణులకు ఉండగా సంస్కృతి,సాంప్రదాయాల పరిరక్షణ గురుతర బాధ్యత వేద పండితులపై ఉందనానరు. సమాజ హితం కాంక్షించే వేదపండితులు,బ్రాహ్మణులు, అర్చకులకు సమాజం నుంచి కూడా సంపూర్ణ సహకారం ఉంటుందన్నా రు. సర్వజన హితం, సర్వ జన సుఖవం వేద పండితులు, బ్రాహ్మణ అర్చకుల లక్షమని వారు అన్నారు.

ఈ సమ్మేళనంలో సంఘం ప్రతినిధి వర్గంలోని ముఖ్యులు మాట్లాడుతూ వేద శాస్త్ర పండితుల కు ధూప,దీప నైవేద్య పధకం కింద రాష్ట్రంలోని 6441 ఆలయాలలోని అర్చకులకు రూ10వేల గౌర వ వేతనం అందిస్తున్నందుకు సిఎం కెసిఆర్‌కు తమ సంఘ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బ్రా హ్మణ సమాజ సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న కెసిఆ ర్ నాయకత్వంలో మరో సారి అధికారంలోకి రావాలని వారు తమ పక్షాన ఆశీర్వదిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ ధూపదీప నైవేద్య అర్చక సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ, సంఘ బాధ్యులు గోపాల కృష్ణ శర్మ, రామలింగేశ్వర శర్మ, భార్గవాచార్యులు, రమేష్ శర్మ,దేశపతి రాజశేఖర శర్మ, చాడ నందబాలశర్మ, శంకర శర్మ, సలాక రాజశేఖర శర్మ,సాయి భార్గవ శర్మ, పాండురంగ శర్మ, శ్రీనివాసా చార్యులు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News