Sunday, April 20, 2025

బ్రాహ్మణులంటే మరీ ఇంత చులకనా

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ ప్రముఖుడు కాశ్యప్‌పై ఎదురుదాడులు
న్యూఢిల్లీ / ముంబయి: అయిన దానికి కాని దానికి బ్రాహ్మణులను కించపర్చడం ఈ రోజుల్లో వేలం వెర్రి అయిందని పలువురు ప్రముఖులు స్పందించారు. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత , నటుడు అనురాగ్ కాశ్యప్ తమ ఫూలే సినిమా విడుదల నేపథ్యంలో బ్రాహ్మణులను కించపరుస్తూ మాట్లాడటం తీవ్ర నిరసనకు దారితీసింది.ఇంతకు ముందు గ్యాంగ్స్ ఆఫ్ వాసెయ్‌పూర్ వంటి సినిమాలకు దర్శకులు అయిన కాశ్యప్ ఇటీవల తమ ఫూలే సినిమాకు సెన్సార్ బోర్డు అభ్యంతరాల పట్ల మండిపడ్డారు. సెన్సార్ బోర్డు బ్రాహ్మణుల ఆధిపత్యంలో ఉందని, తాను బ్రాహ్మణులపై మూత్ర విసర్జన చేస్తానని దర్శకుడు తిట్టడం వివాదాస్పదం అయింది.

ఈ వ్యాఖ్యలపై సర్వత్రా నిరసనలు వెలువడుతున్నాయి. బ్రాహ్మణులు పితృసమానులని. వారికి ఆగ్రహం తెప్పిస్తే ఎవరైనా మసికావల్సిందే అని సామాజిక మాధ్యమాల్లో స్పందనలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాశ్యప్ క్షమాపణ చెప్పాడు. అయితే ఇది కూడా వ్యంగ్యంగా వెటకారంగా ఉంది. తన కూతురు, కుటుంబ సభ్యులకు పరుష పదజాలపు బెదిరింపులు వస్తున్నాయని, ఇది బ్రాహ్మణ పైత్యం అని వ్యాఖ్యానించారు.

కాగా శివసేన యుబిటి ఎంపి ప్రియాంక చతుర్వేది స్పందిస్తూ బ్రాహ్మణులంటే చులకన భావం తగదని చెప్పారు, అంతా ఈ విధంగా తలతిక్కకు దిగడం ఫ్యాషన్ అయిందని విమర్శించారు. బ్రాహ్మణులను ఏది పడితే అది అనడం పరిపాటి అయిందని కేంద్ర మంత్రి సతీష్ చంద్రదూబే వ్యాఖ్యానించారు. బ్రాహ్మణులు తమ అధికార పరిధిలో చరిత్రను వక్రీకరించినట్లు తనకు తెలిసిందని, తనకు సామాజిక న్యాయం , సమానత పై నమ్మకం ఉందని అయితే దీని అర్థం బ్రాహ్మణులను ఏది పడితే అది అనడం కాదని పలువురు స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News