Friday, June 28, 2024

పాక్‌కు రహస్యాలు చేరవేసిన కేసు…. బ్రహ్మోస్ మాజీఇంజినీర్‌కు జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

నాగ్‌పూర్ : పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐకు రహస్యాలు చేరవేసిన కేసులో బ్రహ్మాస్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఇంజినీర్ నిశాంత్ అగర్వాల్‌కు జీవిత ఖైదు పడింది. అధికారిక రహస్యాల చట్టం కింద నాగ్‌పూర్ జిల్లా కోర్టు ఈ శిక్ష విధించింది. దీనికింద అతడు 14 సంవత్సరాల కఠిన కారాగార శిక్షఅనుభవించాల్సి ఉంటుంది. అలాగే కోర్టు రూ.3 వేల జరిమానా విధించింది. నాగ్‌పూర్ లోని బ్రహ్మోస్ సంస్థకు చెందిన మిస్సైల్ కేంద్రం లోని టెక్నికల్ రీసెర్చి సెక్షన్‌లో నిశాంత్ విధులు నిర్వర్తించేవాడు.

ఆ సమయంలో సంస్థకు చెందిన అత్యంత సున్నితమైన సాంకేతిక సమాచారాన్ని ఐఎస్‌ఐకు లీక్ చేశాడని అతడిపై ఆరోపణలు వచ్చాయి. 2018లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన మిలిటరీ ఇంటిలిజెన్స్, ఉగ్రవాద నిరోధక బృందాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో అతడు అరెస్టయ్యాడు. తర్వాత పలు సెక్షన్ల కింద అతడిపై అభియోగాలు నమోదయ్యాయి. విచారణ అనంతరం తాజాగా నాగ్‌పూర్ కోర్టు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. డీఆర్‌డీఓ , రష్యా సంయుక్తంగా ఈ బ్రహ్మోస్ సంస్థను నిర్వహిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News