Thursday, January 23, 2025

బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించిన వాయుసేన

- Advertisement -
- Advertisement -

అండమన్/నికోబార్: భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ మిస్సైల్ బ్రహ్మోస్. ఇప్పటివరకు అనేక పరీక్షలను అధిగమించిన బ్రహ్మోస్ శత్రుభీకర అస్త్రంగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా, మరింత అభివృద్ధి పరిచిన బ్రహ్మోస్ క్షిపణిని భారత వాయుసేన విజయవంతంగా పరీక్షించింది. దీన్ని సుఖోయ్-30ఎంకేఐ యుద్ధ విమానం నుంచి ప్రయోగించగా, బంగాళాఖాతంలోని ఓ లక్షిత ఓడను గురితప్పకుండా తాకింది. ఈ మేరకు భారత వాయుసేన ట్విట్టర్ లో వెల్లడించింది. “బంగాళాఖాతం ప్రాంతంలో Su-30 MKI విమానం నుండి  ఖచ్చితమైన లక్ష్యాన్ని ఛేదించడం ద్వారా, క్షిపణి కోరుకున్న మిషన్ లక్ష్యాలను సాధించింది” అని IAF ట్వీట్ చేసింది.

బ్రహ్మోస్ మిస్సైల్ రేంజి 450 కిలోమీటర్లు. దీన్ని భూతలం, గగనతలం, నౌకల్లోంచి ప్రయోగించవచ్చు. ఇది ధ్వనివేగం కంటే మూడు రెట్లు అధిక వేగంతో ప్రయాణిస్తుంది. గరిష్ఠంగా మాక్ 2.8 వేగాన్ని అందుకోగలదు. తాజా ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో, భారత వాయుసేన పోరాట సామర్థ్యం మరింత పెరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News