Wednesday, January 22, 2025

రేపటి నుంచి యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/యాదాద్రి : తెలంగాణ ప్రసిద్ధ్ది క్షేత్రం యా దాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునఃనిర్మాణం అ నంతరం తొలి సారి వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. నూతన ఆలయంలో స్వయంభు శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 11రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆదివారం ఒక ప్రకటనలో ఆలయ ఈవో గీత తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 21 నుండి మార్చి3 వరకు శ్రీవారి యాదాద్రి నూతన క్షేత్రం తొలి సారి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఆలయం విద్యుత్ దీపలతో పుష్పాలతో అలంకార,ఆలంకార సేవ మూర్తులను, ఉత్సవ సేవకు ఉపయోగించే వాటిని శు భ్రం చేయుట పనులు, సేవ పల్లకి వాటకి రంగులు వేసి శుభ్ర పరుచుట ఆలయంలో కూడా బ్రహ్మోత్సవాలకు సిద్ధం చేయటకు ఆలయ అధికారులుకు ఆదేశం ఇవ్వడం జరగిందని తెలిపారు.

మహోత్సవాలలో అలంకార సేవకు, పారాయణ గావించుటకు ప్రత్యేక అర్చకులు, పండితులు, పారాయాణికులు ఏర్పట్లు చేయడం జరగిందని అన్నారు. 21న స్వస్తివాచనాతో ప్రారంభమై మార్చి 3న శతఘటాభిషేకంతో ఉత్సవ సమాప్తి కానున్నట్లు తెలిపారు.బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘ ట్టాలు 27న ఏదుర్కోలు, 28న తిరుకల్యాణం, మార్చి 1న ది వ్యవిమాన రథోత్సవం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ మహోత్సవాలలో అలంకార సేవలకు భక్తులు పా ల్గొని శ్రీ స్వామి వారి ఆశీస్యులు పోందాలని ఈవో కోరారు.

శ్రీ స్వామి వారికి వస్త్రాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్బంగా మహారాష్ట్ర సోలపూర్ చెందిన వాసులు శ్రీస్వామి అమ్మవారులకు వస్త్రాలను అందచేశారు. సోమవారం ఆలయ ఈవో గీత, ఆలయ అధికారుల సమక్షంలో వస్త్రాలను అందచేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News