నేడు చక్రతీర్థ మహోత్సవం
మన తెలంగాణ/యాదాద్రి : తెలంగాణ మహాక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట యాదాద్రి క్షేత్రంలో శనివారం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ మహావిష్ణు రూపుడిగా గరడవాహన సేవ, సాయంకాలం స్వర్ణ రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహంచారు. బహ్మోత్సవాల్లో భాగంగా ఉత్సవమూర్తులైన స్వామి అమ్మవార్లను ప్రత్యేక అలంకార పూజలను నిర్వహించారు. కల్యాణమూర్తులైన లక్ష్మీనరసింహుడు భక్తులను అనుగ్రహించుటకు శ్రీమహావిష్ణురూపుడిగా అలంకారంతో గరుడవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చాడు. లోక రక్షకుడైన శ్రీమహావిష్ణువు రూపంలో గరుడవాహన సేవలో మేళతాళాల మధ్య వేదమంత్రాలు ఉఛ్ఛరణ చేస్తూ ఊరేగిన తీరు దుష్టశిక్షణ శఙష్టరక్షణ కోసం స్వామి గరుడవాహనంపై కొలువు దీరగా భక్తులు దర్శించుకోవడంతో పాపలు తొలగి పునీతులయ్యారు.
సాయంత్రం ఆలయంలో స్వామి లోకరక్షణ కోసం దివ్యవిమాన రథోత్సవం అత్యంత వైభవంగా కన్నుల పండువగా సాగింది. స్వామివారి ఉత్సవమూర్తులు స్వర్ణ రథంపైకి వేంచేసి భక్తులకు దర్శనం ఇచ్చారు. భక్తజనల దర్శించికుని గోవిందా.. నరసింహ నామములను ఆలకించారు. రథోత్సవ వేడుకలను ఆలయ అర్చకులు శాస్త్రోక్త పూజను నిర్వహించి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్ గీత, భక్తులు పాల్గొన్నారు. శ్రీస్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ఉదయం ఆలయంలో మహా పూర్ణాహుతి, చక్రతీర్థ మహోత్సవం, రాత్రికి పుష్పయాగము, దోపు ఉత్సవం పూజా కార్యక్రమాలు జరగనున్నాయి.