Thursday, January 23, 2025

మెదడు క్యాన్సర్‌ని గుర్తించే మెషిన్ టూల్

- Advertisement -
- Advertisement -

మెదడు, వెన్నుపాములో పెరిగే ప్రాణాంతకమైన క్యాన్సర్ కణితి(tumors) లను గుర్తించ గలిగే మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఆధార కంప్యూటర్ పరికరాన్ని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి )మద్రాస్‌కు చెందిన పరిశోధకులు రూపొందించ గలిగారు. ఈ కణితిలను గ్లియోబ్లాస్టోమా మల్టీఫార్మే (glioblastoma multiforme)అని అంటారు. గ్లియోబ్లాస్టోమా అనేది మెదడు లోని ఆస్ట్రో సైట్లు అనే కణాల్లో పుట్టుకొస్తుంది. మెదడు లోని సెరిబ్రమ్‌లో ఇది ఉత్పత్తి అవుతుంది. ఈ కణితులు చాలా వేగంగా మెదడు, వెన్నుపాములో పెరుగుతుంటాయి.

Also Read: సెప్టెంబర్‌ నుంచి విశాఖలో మకాం: సిఎం జగన్

ఈ ట్యూమర్లను గుర్తించడానికి పరిశోధనలు చేపట్టినప్పటికీ, వైద్యచికిత్సలు మాత్రం పరిమితం గానే ఉంటున్నాయి. వీటిని గుర్తించిన తరువాత జీవించే అవకాశం కేవలం రెండు సంవత్సరాలే ఉండడం గమనార్హం. అంటే ఈ ట్యూమర్లును వైద్యులు గుర్తించిన తరువాత ఆ రోగి రెండేళ్లు కన్నా ఎక్కువ కాలం బతకడం కష్టం. ఈ సాధనాన్ని జిబిఎం డ్రైవర్ అని వ్యవహరిస్తున్నారు. ఆన్‌లైన్ ద్వారా అందుబాటయ్యే ఈ సాధనం ముఖ్యంగా ట్యూమర్లలో మార్పులు గుర్తిస్తుంది. అంటే డ్రైవర్ మ్యుటేషన్లను ప్యాసింజర్ మ్యుటేషన్లను గుర్తిస్తుంది. డ్రైవర్ మ్యుటేషన్ అంటే కణ విస్తరణను , ట్యూమర్ పెరుగుదలను ప్రేరేపించడం.

Also Read: నిరసన వేదిక వద్ద మహిళా రెజ్లర్లకు పిటి ఉష మద్దతు

ప్యాసింజర్ లేదా హిచ్‌హైకర్ మ్యుటేషన్స్ అన్ని రకాల క్యాన్సర్ మ్యుటేషన్లను ప్రతిబింబిస్తుంది. క్యాన్సర్‌ను కలిగించే మ్యుటేషన్లను గుర్తించడానికి వీలుగా ముఖ్యమైన అమినోయాసిడ్ లక్షణాలను గుర్తించ గలిగామని ఐఐటి మద్రాస్ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ ఎం. మైకేల్ గ్రోమిథా వెల్లడించారు. దీనివల్ల డ్రైవర్ , న్యూట్రల్ మ్యుటేషన్లకు గల తేడాను కచ్చితంగా అంచనా వేయగలిగామని తెలిపారు. గ్లియోబ్లాస్టోమాలో డ్రైవర్ మ్యుటేషన్లను ఈ సాధనం గుర్తించ గలుగుతుందని, సమర్థవంతమైన చికిత్స లక్షాలను గుర్తించేందుకు , తద్వారా ఔషధ రూపకల్పన వ్యూహాలను అభివృద్ది చేయడానికి దోహద పడుతుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఈ వెబ్ సర్వర్‌ను అభివృద్ధి చేయడం కోసం ఈ పరిశోధక బృందం 9386 డ్రైవర్ మ్యుటేషన్లను, 8758 ప్యాసింజర్ మ్యుటేషన్లను విశ్లేషించింది.

Also Read: మే 26న నరేష్- పవిత్రల ‘మళ్ళీ పెళ్లి’ విడుదల

గ్లియోబ్లాస్టోమా లో డ్రైవర్ మ్యుటేషన్లను 81.99 శాతం కచ్చితంగా గుర్తించడానికి వీలైంది. ఈ విధానం పూర్తిగా ప్రొటీన్ క్రమంపై ఆధారపడింది. ఇందులోని ఎంఐ పరికరం ఇతర వ్యాధుల ఉనికిని గుర్తించడానికి ఉపయోగించవచ్చు. అమెరికా లోని కోల్డ్ స్ప్రింగ్ హార్బర్ లేబొరేటరీకి చెందిన పరిశోధకులు కూడా దీనిపై పరిశోధనలు సాగించారు. వీరు బిఆర్‌డీ 8. సీ53 అనే ప్రొటీన్లపై దృష్టి కేంద్రీకరించారు. పి 53 అనేది క్యాన్సర్ల నుంచి రక్షణ కలిగిస్తుంది. కణాలు అసంఖ్యాకంగా పెరిగి, కణితులుగా మారకుండా ఇది నిరోధించగలుగుతుంది. ఈ ప్రొటీన్ సామర్థం కొరవడితేనే క్యాన్సర్లు విజృంభిస్తుంటాయి.

Also Read: కారు రూఫ్‌పై ఎగిరిపడ్డ బైకర్: 3 కి.మీ. ప్రయాణం.. గాయాలతో మృతి

గ్లియోబ్లాస్టోమా క్యాన్సర్ వేగంగా పెరగడం వల్లనే మెదడుపై ఒత్తిడి ఎక్కువై తీవ్రంగా తలనొప్పి, మూర్ఛ, వాంతులు, ఆలోచన శక్తి మందగించడం , వినికిడి కోల్పోవడం, భావోద్వేగాల్లో అస్తిరత, , ఒకే వస్తువు రెండుగా కనిపించడం, మాటలు తడబడడం, మానసిక అవస్థలోమార్పులు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. వైద్యులు ఈ క్యాన్సర్ ట్యూమర్లను గుర్తించడానికి మేగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ (ఎంఆర్‌ఐ),కంప్యూట్ టోమోగ్రఫీ (సిటి), పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (పిఇటి)స్కాన్లు వంటివి నిర్వహిస్తుంటారు. ట్యూమర్లని నిర్ధారించడానికి బయోప్సీ (జీవాణు)పరీక్ష, మెదడు కణజాల పరీక్ష చేయవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News