Wednesday, January 22, 2025

అల్జిమర్స్ వ్యాధికి మేలైన అంచనా మెదడు ఆరోగ్యమే

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రొటీన్లు ముద్దకట్టడం, వయసు మాత్రమే కాదు, అల్జిమర్స్ పెరుగుదలను మేలుగా అంచనా వేయగలిగేది మెదడు ఆరోగ్యమేనని కొత్త అధ్యయనం వెల్లడించింది. అమెరికా లోని పిట్స్‌బర్గ్ యూనివర్శిటీ న్యూరాలజీ ప్రొఫెసర్ ఆస్కార్ లోపెజ్ నేతృత్వంలో ఈ పరిశోధన సాగింది. మెదడులో పిండి పదార్ధం మాదిరిగా అమిలాయిడ్ ప్రోటీన్లు ముద్ద కట్టడం, అల్జిమర్స్ వ్యాధికి సంకేతమని , వృద్ధాప్యంలో ఇది పెరుగుతుందని పరిశోధకులు వెల్లడించారు. మెదడులో బూడిద రంగు పదార్ధం మందం రానురానూ క్షీణించడం, మెదడులో పుండు లేదా గాయాలు ఏర్పడడం కూడా అల్జిమర్స్ వ్యాధిని సూచించే లక్షణాలుగా పరిశోధకులు వివరించారు. ఈ పరిశోధన “జర్నల్ న్యూరాలజీ” లో వెల్లడైంది. ఈ అధ్యయనంలో లో జ్ఞాపకశక్తి క్షీణించడంలో ఒకరికొకరికి పోలిక లేని 94 మంది వయో వృద్ధులను తీసుకున్నారు.

వీరి సరాసరి వయసు 85 సంవత్సరాలు. వారి చివరి కాలం వరకు దాదాపు 11 సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. వీరి మెదళ్లలో ప్రొటీన్ పేరుకుపోవడాన్ని యువత మెదళ్లతో పోల్చి అధ్యయనం చేశారు. ఈ యువకులు ఆస్ట్రేలియాకు చెందిన ఇమేజింగ్ , బయోమార్కర్ , లైఫ్‌స్టైల్ ( ఎఐబిఎల్) గ్రూపుకు చెందినవారు. అధ్యయనంలో ఉన్న వారి మెదళ్లలో కాలానుగుణంగా అమిలాయిడ్ ప్రొటీన్లు పేరుకుపోతుండడం గమనించారు. 80 ఏళ్ల వృద్ధుల్లో ఈ ప్రక్రియ చాలా వేగవంతం కావడం కనిపించింది. ఇదే కాకుండా ప్రొటీన్లు ముద్దయిపోవడం కనిపించని మెదళ్లలో రెండేళ్లు ముందుగానే డెమెన్షియా (చిత్త వైకల్యం ) అభివృద్ధి కావడం స్కాన్లలో కనిపించింది. జ్ణానపరంగా వ్యక్తులు సాధారణంగా ఉన్నప్పుడు అమిలాయిడ్ బాగా పేరుకుపోయినప్పటికీ డెమెన్షియా చికిత్స అమలు చేయడం చాలా కష్టమని గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News