Wednesday, January 22, 2025

బ్రెయిన్ స్ట్రోక్ అతి ప్రమాదకరం

- Advertisement -
- Advertisement -

బ్రెయిన్ స్ట్రోక్ అతి ప్రమాదకరమైన సమస్య. మెదడులో ఒక భాగానికి రక్తం సరఫరా ఆగిపోతే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దీనివల్ల కాలూ చేయి పనిచేయకపోవచ్చు. మెదడులో రక్తం గడ్డకట్టడం, ఆక్సిజన్ ప్రవాహం అడ్డుకున్నప్పుడు ఈ సమస్య వస్తుంది. ఈ విధంగా రాడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఉప్పు ఎక్కువగా తింటే ఈ సమస్యలు తప్పవు. హై బ్లడ్ ప్రెజర్ అనేది బ్రెయిన్ స్ట్రోక్ రాడానికి ముఖ్య కారణం.

బిపి వల్ల స్ట్రోక్‌తోపాటు అనేక సమస్యలు వస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు ఈ సమస్య గురించి జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం చాలా అవసరం. స్థూలకాయం ఉన్నా, శరీరం బరువు ఎక్కువగా ఉన్నా స్ట్రోక్ వంటి సమస్యలు వస్తాయి. శరీరం బరువు తగ్గేలా చూసుకోవాలి. సాధారణంగా 55 ఏళ్ల తరువాత ఎక్కువగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఆడవారికంటే మగవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. స్ట్రోక్‌లో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. మెదడులో రక్తం గడ్డకట్టడం వల్ల మెదడుకు రక్తం సరఫరా ఆగినప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది. ఇక రక్త నాళాలు పగిలిపోవడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ వస్తుంది.

వీటిలో ఇస్కీమిక్ స్ట్రోక్ కేసులో ఎక్కువగా వస్తుంటాయి. ఈ రెండు రకాల స్ట్రోక్స్‌లో ఏది వచ్చినా ముందుగా తలనొప్పి వస్తుంది. హెమరేజి స్ట్రోక్ సాధారణ లక్షణం తలనొప్పి. వైద్యనిపుణుల అభిప్రాయం ప్రకారం కరోటెడ్ ఆర్టరీ నుంచి స్ట్రోక్ మొదలవుతుంది. ఈ సమయంలో తీవ్రమైన తలనొప్పి వస్తుంది. కరోటెడ్ ధమని మూసుకుపోవడం వల్ల తలనొప్పి వస్తుందని న్యూరాలజీ వైద్యులు చెబుతున్నారు.

ఏ ప్రాంతంలో రక్తం గడ్డ కడితే ఆ ప్రాంతంలో సమస్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు వివరిస్తున్నారు. తలనొప్పితోపాటు ముఖం ఓ వైపుకి వంగిపోవడం, రెండు చేతులు పైకి ఎత్తలేక పోవడం, ఓ చేయి తిమ్మిరిగా ఉండడం, బలహీనంగా మారడం, స్పష్టంగా మాట్లాడలేక పోవడం, ఆందోళనగా అనిపించడం, వాంతుల్లో కళ్లు తిరగడం, స్పృహ తప్పడం, నడవలేకపోవడం ఇవన్నీ స్ట్రోక్ లక్షణాలే. ఈ లక్షణాలు వచ్చినప్పుడు వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News