Sunday, January 19, 2025

ఓటిటిలోకి ‘భ్రమయుగం’ సినిమా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘భ్రమయుగం’ సినిమా వివిధ భాషల్లో విడుదలై రికార్డు వసూళ్లు సృష్టించింది. ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముటి నటించారు. తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు బాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాను బ్లాక్ అండ్ వైట్‌లో తెరకెక్కించడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. సినిమా కథ కొత్తగా ఉండడంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. విభిన్న కథలు ఎంచుకోవడంలో మమ్ముటి ఎప్పుడూ ముందు వరసలో ఉంటాడు. వైవిధ్యభరతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించాడు. భ్రమయుగం సినిమా ఓటిటిలో విడుదల కావడంతో ఆయన అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. సోనీ లైవ్‌లో మార్చి 15 నుంచి సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. వీకెండ్‌లో ‘భ్రమయుగం’ ‘సినిమా చూసి ప్రేక్షకులు ఆనందంలో మునిగిపోవచ్చు. కేవలం మూడు నాలుగు ప్రాతలు గల సినిమాను రెండు గంటల పాటు నడిపించడం గ్రేట్‌గా నిలుస్తుంది. ఫిబ్రవరి 15న మలయాళం విడుదలై తెలుగులో మాత్ర ఫిబ్రవరి 23న విడుదలైంది. దర్శకుడు రాహుల్ సదాశివన్ అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో మణికందన్, అమాల్దా లిజ్, సిద్ధార్థ్ భారతన్, అర్జున్ అశోకన్లు నటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News