Monday, December 23, 2024

నీటిలో మునిగిపోతున్న స్నేహితులను కాపాడిన బాలుని సాహసం

- Advertisement -
- Advertisement -

పనాజి ( గోవా): రాష్ట్ర రాజధాని పనాజీకి 15 కిమీ దూరంలో ఉన్న కుంబార్జువా గ్రామంలో నదిలో మునిగిపోతున్న ముగ్గురు పిల్లలను పదేళ్ల బాలుడు అంకుర్ కుమార్ సంజయ్ ప్రసాద్ సాహసించి వారిని రక్షించాడు. గ్రామ దేవత ఉత్సవాలు సందర్భంగా నలుగురు స్నేహితులు అక్కడికి వెళ్లి దగ్గర్లోని నది వద్దకు వెళ్లగా వారిలో ముగ్గురు నీటిలో జారి పడిపోయారు.

ఇదంతా చూసిన మరో బాలుడు అంకుర్‌కుమార్ తన ప్రాణాలను పణంగా పెట్టి వారిని ఒడ్డుకు చేర్చాడు. సీపీఆర్ చేయడంతో వారు తేరుకున్నారు. అనంతరం స్థానికుల సాయంతో అంబులెన్‌కు ఫోన్ చేశాడు. ఎంతో ధైర్యసాహసాలు కనబరిచి ఆ బాలుర ప్రాణాలు కాపాడిన సంజయ్ పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగింది. దీంతో ఆ బాలుడికి రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష బహుమతిని ప్రకటించింది. శుక్రవారం సీఎం ప్రమోద్ సావంత్ చెక్కును అందించి ప్రశంసించారు.

“ చిన్నవయసులో ధైర్యసాహసాలు ప్రదర్శించి , స్నేహితులను కాపాడిన బాలుడ్ని కలవటం ఎంతో ఆనందంగా ఉంది , అతడ్ని చూసి గోవా ఎంతో గర్విస్తోంది. అతడిని ప్రోత్సహించేందుకు రూ. లక్ష చెక్కును అందజేశాం. తనకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నాను ” అని సిఎం ప్రమోద్ సావంత్ అభినందించారు. దీంతో బాలుడుతో దిగిన ఫోటోను సిఎం సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News