Wednesday, January 22, 2025

సింహం నోటికి చిక్కిన ఆవు..రైతును చూసి పరుగులు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: సింహం నోట చిక్కిన తన పెంపుడు ఆవును విడిపించడానికి ఓ రైతు అత్యంత సాహసాన్ని ప్రదర్శించాడు. చేతిలో ఎటువంటి ఆయుధం లేకుండానే సిహాన్ని పారదోలి ఆవు ప్రాణాన్ని కాపాడాడు. గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో శుక్రవారం సోషల్ మీడడియాలో వైరల్ అయింది. కొడినర్ తాలూకాలోని అలిదర్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. బిజెపి నాయకుడు, కేషోడ్ మునిసిపాలిటీ వార్డు సభ్యుడు వివేక్ కటాడియా ఈ వీడియోను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో షేర్ చేశారు.

ఆసియా జాతి సంహాలు అధిక సంఖ్యలో నివసించే గిర్ అభయారణ్యం ఈ జిల్లాలోనే ఉంది. ఇక్కడ గ్రామాలలోకి తరచు సిఃహాలు ప్రవేశిస్తుంటాయి. కారు విండోలనుంచి చిత్రీకరించిన ఈ వీడియోలో సింహం నోట చిక్కిన ఆవు తప్పించుకోవడానికి పెనుగులాడుతుండగా దూరం నుంచి ఒక వ్యక్తి వాటి దగ్గరకు వస్తూంటాడు. అతను గట్టిగా కేకలు వేసినప్పటికీ సింహం బెదరలేదు. దీంతో అతను చేతిలో రాయి తీసుకుని ఆ రెండు జంతువుల వైపు అడుగులు వేయగా అప్పుడు సింహం ఆవును వదిలేసి ప్రాణభయంతో పక్కనున్న పొదలలోకి పరుగులు తీస్తుంది. ఈ సంఘటన గురువారం అలిదర్ గ్రామ పొలిమేరల్లో జరిగిందని రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ అశోక్ అమీన్ తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News