Friday, November 15, 2024

ధీరుడు సర్వాయి పాపన్న : బిజెపి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : దొరలు, జమిందారులు, మొఘలులను ఓడించిన ధీరుడు సర్వాయి పాపన్న అని బిజెపి జాతీయ ఓబిసి మోర్చా అధ్యక్షులు డాక్టర్ కే లక్ష్మణ్ కొనియాడారు. శుక్రవారం సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద లక్ష్మణ్ సహా నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ బహుజనుల ఆత్మగౌరవ పోరాటానికి ఆయన స్ఫూర్తి అని చెప్పారు. వృత్తిని అవహేళన చేసి అగౌరవంగా వ్యవహరించిన వారిపై ఆయన తిరుగుబాటు చేశారని చెప్పారు. రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తే నిజమైన చరిత్రకారులను వెలుగులోకి తీసుకొస్తామన్నారు. కులవృత్తుల వారికి సాయంగా ‘విశ్వకర్మ యోజన’ పథకాన్ని ప్రధాని మోడీ తీసుకొస్తున్నారని చెప్పారు. రూ.13వేల కోట్లతో 30లక్షల కుటుంబాలకు ఊతమివ్వనున్నారని లక్ష్మణ్ వివరించారు. మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో కాకతీయుల తర్వాత బహుజన వీరుడు సర్వాయి పాపన్న అని చెప్పారు.
మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం..
ఓబిసిలకు చెందిన 18 సంప్రదాయ వృత్తుల వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి అవసరమైన పరికరాలు అందించడానికి ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మ పథకాన్ని ప్రకటించడాన్ని స్వాగతిస్తూ ఓబిసి మోర్చా సమావేశాన్ని నిర్వహించింది. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం (పాలాభిషేకం) చేశారు.

BJP-and-PM

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News