Tuesday, September 17, 2024

‘ఎక్స్’పై నిషేధం

- Advertisement -
- Advertisement -

అమెరికా వ్యాపారవేత్త, ఎక్స్ (ట్విట్టర్) అధినేత ఎలాన్ మస్క్‌కు బ్రెజిల్ సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. కోర్టు బ్రెజిల్‌లో ఎక్స్‌పై నిషేధం విధించింది. స్థానికంగా తమ దేశంలో ఒక ప్రతినిధిని నియమించేందుకు మస్క్ నిరాకరించడంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టు తెలియజేసింది. నిషేధపు ఉత్తర్వులను ఉల్లంఘించి విపిఎన్ ద్వారా ఎక్స్‌ను ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని కోర్టు పదే పదే హెచ్చరించింది. దాదాపు నాలుగు కోట్ల జనాభా ఉన్న బ్రెజిల్‌లో 80 లక్షల మంది ఎక్స్‌ను ఉపయోగిస్తున్నారు. నెలకు ఒక సారైనా ఎక్స్‌లో పోస్ట్‌లు పెట్టడం, కామెంట్లు పెట్టడం వంటివి చేస్తుంటారని ఒక సర్వే వెల్లడించింది.

బ్రెజిల్‌లో ఎక్స్ ప్రవేశించిన తరువాత ఇప్పటి వరకు కంపెనీ తరఫున ప్రతినిధిని నియమించలేదు. స్థానికంగా ఏర్పడే న్యాయ వివాదాలను పరిష్కరించుకోవడానికి లీగల్ రిప్రజెంటేటివ్‌ను నియమించాలని బ్రెజిల్ సుప్రీం కోర్టు ఎక్స్‌కు సూచించింది. కానీ ఆ సూచనను మస్క్ కంపెనీ పెడచెవిన పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు ఎక్స్ సేవలను దేశంలో నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, ఎక్స్‌పై ఇంత వరకుఏడు దేశాలు నిషేధం విధించాయి. అవి & చైనా, ఇరాన్, తుర్క్‌మినిస్తాన్, ఉత్తర కొరియా, ఉజ్బెకిస్తాన్, రష్యా, మయన్మార్.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News