Wednesday, January 22, 2025

అతడికి 65… ఆమెకు 16… అత్తకు పదోన్నతి

- Advertisement -
- Advertisement -

బ్రెసీలియా: 65 ఏళ్ల మేయర్ 16 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకొని అత్తకు అల్లుడు పదోన్నతి గిఫ్ట్‌గా ఇచ్చిన సంఘటన బ్రెజిల్‌లోని అరౌకారియాలో జరిగింది. అరౌకారియా నగర మేయర్ హిస్సామ్ హుస్సేన్ దేహైని(65) అనే మేయర్ 16 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇలా వివాహం చేసుకున్నాడో లేదో కానీ అత్తకు విద్యాశాఖలో పదోన్నతి కల్పించడంతో దుమారం రేపుతోంది. మేయర్‌పై వచ్చిన అవినీతి, బంధుప్రీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాయి. 16 ఏళ్ల అమ్మాయి తల్లిదండ్రులు అనుమతిలో పెశ్లిచేసుకోవచ్చని బ్రెజిల్ చట్టాలు చెబుతున్నాయి. 16 ఏళ్ల దాటిన తెల్లారే తన కూతురుకు ఆ మేయర్‌కు ఇచ్చి ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. సదరు మేయర్ ఇప్పటికే ఐదుగురిని పెళ్లి చేసుకొని వదిలేశాడు. పదోన్నతి కోసమే ఈ వివాహం జరిపించి ఉంటారని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయాలు బంధుప్రీతి, అవినీతితో మురికిగుంటలా మారాయని నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. కాటికి కాలు జాపే వయసులో వృద్ధుడికి ఇదేం మాయ రోగమని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Also Read: ఆర్టీసీ చరిత్రను తిరగరాస్తాం: బండి సంజయ్

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News