Sunday, December 22, 2024

లండన్‌లో బ్రెజిల్ యువకుడు దాడి.. రంగారెడ్డి యువతి మృతి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: లండన్ లో రంగారెడ్డి జిల్లాకు చెందిన యువతి హత్యకు గురైంది. మృతురాలిని రంగారెడ్డి జిల్లా బ్రాహ్మణపల్లికి చెందిన తేజస్వినిరెడ్డి(27)గా గుర్తించారు. తేజస్వినిపై బ్రెజిల్ కు చెందిన యువకుడు కత్తితో దాడి చేశాడు. తేజస్విని మిత్రులతో కలిసి లండన్ లో నివాసం ఉంటుంది. యువకుడు తేజస్విని, ఆమె స్నేహితురాలిపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. యువకుడి దాడిలో తేజస్విని తీవ్రంగా గాయపడి మృతిచెందింది.

మరో అమ్మాయికి తీవ్రగాయాలయ్యాయి. తక్షణమే ఆమెను సమీప ఆస్పత్రికి తరలించారు. తేజస్విని రెండు నెలల క్రితమే ఎంఎస్ పూర్తి చేసింది. భారత్ రావాల్సి ఉండగా హత్యకు గురైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News