Monday, January 20, 2025

పెద్ద వాగుకు గండి: అనేక గ్రామాలు మునక

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్/అమరావతి: గత రెండు రోజులుగా పెద్దవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తున్నందున భయపడుతున్నట్లుగానే ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పదుల సంఖ్యలో గ్రామాలు నీటమునిగాయి, వేలాది ఎకరాల్లో పంటలు, ఇళ్లు, పశువులు, విలువైన వస్తువులను వదిలేసి ప్రజలు ప్రాణాలు దక్కించుకుంటున్నారు.

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలంలో కొన్ని మైనర్ ఇరిగేషన్ ట్యాంకులు తెగిపోయాయి. ఆ నీరు భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు వద్దకు చేరడం మొదలైంది.

పెద్దవాగు ప్రాజెక్టు మూడు గేట్ల నుంచి గురువారం 35 వేల క్యూసెక్కులు వదులుతున్నప్పటికీ 70 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తోంది. మూడు గేట్లలో ఒక దానికి  మెకానికల్ సమస్య ఏర్నడ్డంతో పనిచేయడం మానేసింది. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో కట్టపై నుంచి నీరు ప్రవహించింది. ప్రమాదాన్ని పసిగట్టిన అధికారులు చుట్టుపక్కల గ్రామాలకు హెచ్చరికలు జారీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భయపడినట్లుగానే రాత్రి 7.45 గంటల ప్రాంతంలో కట్ట మైసమ్మ దేవాలయం సమీపంలోని నారాయణపురం గ్రామం వద్ద 250 మీటర్ల పొడవున ప్రాజెక్టు కట్ట తెగిపోయింది. తెగిపోయిన కట్టను బాగు చేసేందుకు రూ.20 కోట్లు అవసరమని అంచనా.

Pedda Vaagu2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News