Monday, January 20, 2025

ఎల్లుండి నుంచి యాదాద్రిలో బ్రేక్ దర్శనాలు

- Advertisement -
- Advertisement -

break darshans at yadadri from 31 october

యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఈ నెల 31వ తేదీ నుంచి బ్రేక్ దర్శనాలు అమలు చేయనున్నారు. స్వామి వారి దర్శనానికి వచ్చే వి.ఐ.పి భక్తులు, రాజ్యాంగబద్ధ పదవులలో గల వారి సిఫారసులపై వచ్చేవారితో పాటు సామాన్య భక్తులకు ఈ అవకాశం కల్పించనున్నారు. ప్రతి పర్యాయం 200 నంబర్లు టికెట్లు మించకుండా ఒక్కొక్కరికి రూ.300/-ల టికెట్‌పై ఉత్తర రాజగోపురం ద్వారా ఆలయ ప్రవేశం కల్పించనున్నారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనం కల్పించనున్నట్లు ఆలయ ఈఓ గీత తెలిపారు. ఈ బ్రేక్ దర్శన సమయంలో ధర్మదర్శనం, ప్రత్యేక దర్శనం నిలుపనున్నట్లు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News