‘రిజర్వాయర్స్ అఫ్ సైలెన్స్’ పుస్తకం విడుదల
మన తెలంగాణ/హైదరాబాద్ : మేధావులు మౌనం వీడవలసిందిగా సీనియర్ జర్నలిస్ట్ కే రామచంద్ర మూర్తి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల సమాజం చాల ఎక్కువగా నష్టపోవలసి వస్తుందని ఆయన హెచ్చరించారు. ’రిజర్వాయర్స్ అఫ్ సైలెన్స్’ అనే ఆంగ్ల పుస్తకాన్నిసోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మేధావుల మౌనం వల్ల వచ్చే నష్టాలేమిటో కాళేశ్వరం ప్రాజెక్ట్ లో తలెత్తిన సమస్యల వల్ల అవగతం అయిందని, ఇకనైనా వారు బహిరంగంగా మాట్లాడాలని ఆయన సూచించారు.
ఈ పుస్తకాన్ని ‘ది హిందూ’ పత్రికలో పనిచేసి ఇటీవలే పదవి విరమణ చేసిన ఆర్.అవధాని రచించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర జ్యోతి సంపాదకుడు కె. శ్రీనివాస్, ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావు, అల్ ఇండియా కిసాన్ సభ అఖిల భారత ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి, నిర్వాసితుడు హయతుద్దీన్ పాల్గొన్నారు.