Monday, December 23, 2024

లోకేష్ పాదయాత్రకు బ్రేక్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో టీడీపీ నేత నారా లోకేష్ బాబు యువగళం పాదయ్రాతను తాత్కాలికంగా విరమించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో యువగళం పాదయాత్ర కొనసాగుతున్నది. నియోజకవర్గ ఓటర్ల తప్ప స్థానికేతరులు ఇక్కడ ఉండకూడదని టీడీపీ నేతలకు ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. 48 గంటల ముందే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది.

ఈ నేపథ్యంలో ఎన్నికల నిబంధనలను గౌరవిస్తూ రెండు రోజుల ముందే లోకేష్ పాదయాత్రకు విరామం ప్రకటించారు. ఇప్పటి వరకు 529.1 కి.మీ.ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. శనివారం కాటేవారిపల్లిలోని పాదయాత్ర శిబిరం నుంచి సతీమణి బ్రాహ్మణితో కలిసి రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ నెల 14న కాటేవారిపల్లి నుంచి పాదయాత్రను పునః ప్రారంభిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News