Saturday, November 23, 2024

రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అల్పాహారం అమలు చేయాలి: బాలల సంక్షేమ సంఘం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పాఠశాలలో సిఎం కెసిఆర్ అల్పాహారం పథకాన్ని అమలు చేయాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ కోరారు. శుక్రవారం అన్ని పాఠశాలలో అల్పాహారం పథకాన్ని అమలు చేయాలంటూ ఆన్‌లైన్‌లో వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో ప్రవేశ పెట్టిన అల్పాహారం పథకం గ్రామీణ ప్రాంతాలలో వంతుల వారీగా మండలంలోని పాఠశాలల్లో వారం వారం ఒక్కో పాఠశాలలో ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.

తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో వడ్డించే వారికి గిట్టుబాటు కావడం లేదని అందుకోసం బ్రేక్ ఫాస్ట్ కోసం, మధ్యాహ్న భోజనానికి అవసరమైన సరుకులు ప్రభుత్వమే అందిస్తే నాణ్యమైన బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజనం వండి పెట్టే అవకాశం ఉంటుందన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు పెంచిన వేతనాలను, పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News