Monday, December 23, 2024

హెచ్‌ఐవికి టీకా వచ్చేసింది

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచంలో లక్షలాది మంది హెచ్ఐవి వైరస్ బారినపడి మరణిస్తున్నారు. ఆ వైరస్ తరచూ మ్యుటేషన్ కు గురవ్వడం వల్ల ఆ వ్యాధిని నయం చేయడం కుదరడం లేదు. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన ఏడు వ్యాక్సిన్ లు కూడా అంతగా ప్రభావం చూపలేదు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఎంఐటి పరిశోధకులు తాజాగా హెచ్ఐవి నియంత్రణకు ఓ టీకాను అభివృద్ధి చేశారు.

హెచ్‌ఐవి నియంత్రణ కోసం ఈ టీకాను వారం వ్యవధిలో రెండు మోతాదులుగా ఇస్తారు. తొలి డోసులో 20 శాతం వ్యాక్సిన్‌ను, రెండో డోసులో 80 శాతం వ్యాక్సిన్‌ను రోగికి వేస్తారు. స్వల్ప వ్యవధిలో ఇచ్చే ఈ రెండు డోసులతో వైరస్‌ మ్యుటేషన్‌ జరిగేలోగా టీకా తన పనిని ప్రారంభిస్తుందని, రోగ నిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎలుకలపై చేసిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు వెల్లడించారు. ‘ ఇంట్రెస్టింగ్‌ ఇంజినీరింగ్‌’ ఈ వివరాలను వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News