కాలుష్యం, ఇతర అనారోగ్యవాతావరణం కారణంగా శ్వాస సంబంధిత సమస్యలు ఎక్కువయ్యాయి. ఈ సమస్య ఉంటే ఎక్కువసేపు నడవలేరు. ఏపనీ చేయలేరు. కొన్ని అడుగులు నడిచిన తరువాత ఊపిరాడక, ఉక్కిరిబిక్కిరి అవుతుంటే గుండె, లేదా ఊపిరితిత్తుల సమస్యగా కొందరు భావించి వైద్యులను సంప్రదించకుండానే స్వంతవైద్యం చేస్తుంటారు. అంటే తమకు తోచిన చిట్కాలు ప్రయోగిస్తారు.
గుండె బాగా పనిచేయాలనే ఉద్దేశ్యంతో కఠోరమైన వ్యాయామం చేస్తుంటారు. కానీ అలా చేయరాదు. శ్వాస ఆడక పోవడం అనేది చాలా కారణాల వల్ల వస్తుంది. డయాబెటిస్, ఒబిసిటీ ఉన్న వృద్ధులకు శ్వాససమస్య వస్తే కష్టమే. అలాగే నిమోనియాతో బాధపడే వాళ్లకు ఈ సమస్య వస్తే చాలా ప్రమాదం అవుతుంది. కరోనా రోగుల్లో ఈ సమస్య కూడా ఎదురౌతోంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఈ సమస్య ఉన్నవారు కొన్ని ఆహార పదార్ధాలు తీసుకోకూడదు. ఆహారం సరైనది కాకపోతే ఈ సమస్య మరీ తీవ్రమౌతుంది. అందుకనే ఆహార అలవాట్లప ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
సంపూర్ణ పోషకాహార విలువలు గలిగిన పాలు కూడా శ్వాస సమస్య ఉన్న వారికి పనికిరావు. ఉప్పు మితంగా ఉండాలి. ఉప్పులో సోడియం కంటెంట్ వల్ల రక్తపోటు ఎక్కువవుతుంది. గొంతు ఇన్‌ఫెక్షన్ కూడా వస్తుంది. ఆల్కహాలు తీసుకోవడం మంచిది కాదు. అతిగా మద్యం సేవిస్తే కాలేయం దెబ్బతింటుంది. శ్వాససమస్య తీవ్రం అవుతుంది. వక్క తినకూడదు. దీనివల్ల వ్యర్థాలు వ్యాపిస్తాయి. నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.