బెంగళూరు: కర్నాటకలో నడిరోడ్డుపై రియల్ ఛేజింగ్ సీన్ కనిపించింది. పోలీసుల ఛేజింగ్ ను జనాలు ఇట్రస్టింగ్ గా చూశారు. ఎస్ఐ, కానిస్టేబుల్ లంచం తీసుకుంటూ పట్టుబడడంతో వారు రోడ్డుపై పరుగులు తీశారు. ఒక కిలో మీటరు పరుగెత్తిన తరువాత వారిని పట్టుకొని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తుమూకురు ప్రాంతం చంద్రశేఖర్ పోరా పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ సోమశేఖర్, కానిస్టేబుల్ నయాజ్ అహ్మాద్ విధులు నిర్వహిస్తున్నారు. చంద్రన్న అనే వ్యక్తి ఇంట్లో కలహాలు చెలరేగడంతో స్థానిక చంద్రశేఖర్ పోరా పిఎస్ లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు చంద్రన్న వాహనాన్ని సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో కేసును కొట్టివేయడానికి 28 వేల రూపాయలు కావాలని ఎస్ఐ, కానిస్టేబుల్ డిమాండ్ చేశాడు. దీంతో వెంటనే చందన్న ఎసిబి అధికారులను కలిశాడు. చంద్రన్న కానిస్టుబుల్ కు రూ.12000 ఇస్తుండగా ఎసిబి అధికారిణి విజయ లక్ష్మి పట్టుకుంది. ఇదే సమయంలో కానిస్టేబుల్, ఎస్ఐ రోడ్డుపై పరుగులు తీయడంతో ఛేజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు.