Friday, April 4, 2025

ప్రభుత్వ కార్యలయాలలో పని అవ్వాలంటే లంచం ముట్టజెప్పాల్సిందే..

- Advertisement -
- Advertisement -

తహశీల్దార్ కార్యాలయంలో ఫైల్ ముందుకు కదలాలంటే చేతులు తడపాల్సిందే. అందుకు నిదర్శనంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ గురువారం మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్న బలరాం షాది ముబారక్ ఫైల్ ను క్లియర్ చేయడానికి సంబంధిత వ్యక్తుల దగ్గర నుండి డబ్బులు తీసుకుంటున్న విషయంపై శుక్రవారం సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ ఛల్ చేస్తోంది.  ఈ విషయంపై బాల రామ్ ను ఫోన్ ద్వారా వివరణ కోరగా వ్యక్తిగతంగా తనను ఇబ్బందులు పెట్టడానికి కొంతమంది కుట్ర పన్ని ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియో పై వివరణ కోరగా ఆయన సమాధానాన్ని దాటవేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News