- Advertisement -
నారాయణపురం: యాదాద్రి జిల్లాలోని సంస్థాన్ నారాయణపురం మండలం చిట్టన్నబావి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటుకల ట్రాక్టర్ అదుపుతప్పి డ్రైవర్ సహా ఇద్దరు కూలీలు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ ఎల్లయ్యకు గుండెపోటు రావడంతో ట్రాక్టర్ అదుపుతప్పింది. శేరిగూడెంలో ఇటుకలు దింపి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. మృతిచెందిన కూలీలు సీతారం, దుర్గ ఎపి వాసులుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
- Advertisement -