- Advertisement -
హైదరాబాద్: ఆంధ్ర మధ్వసమాఖ్య ఈనెల 19వ తేదీ ఆదివారం రాజమండ్రిలో వధూవర పరిచయ వేదిక నిర్వహిస్తోంది. మల్లిగ సత్రంలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమయ్యే ఈ వివాహ పరిచయ వేదికకు ప్రముఖ ఆడిటర్ అంగర లక్ష్మీనరసింహారావు అధ్యక్షత వహిస్తారు. కానుగోవి వాసుదేవాచార్యులు వధూవరుల బుక్ లెట్ ను ఆవిష్కరిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మధ్వ వధూవరులు తమ తల్లిదండ్రులతో వచ్చి ఈ పరిచయ వేదిక కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మధ్వ సమాఖ్య ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది.
- Advertisement -