Monday, November 18, 2024

వంట పాత్రలో వరదనీదుకుని పెళ్లికి వచ్చిన నవజంట

- Advertisement -
- Advertisement -

Bride and groom reach wedding hall in cooking vessel

అలప్పుజ ( కేరళ): ప్రకృతి వైపరీత్యం ఎదురైనా ప్రేమకు హద్దులు ఆటంకాలు ఉండవు. కేరళలో వరదలతో రహదారులన్నీ జలమయమైనా అవన్నీ అధిగమించి ఓ ప్రేమజంట పెద్దలు కుదిర్చిన ముహూర్తానికి సాహసించి చేరుకోగలిగారు. అల్యూమినియం వంట పాత్రలో కూర్చుని వరద నీటిని ఈదుకుంటూ పెళ్లి మంటపానికి చేరుకోగలిగారు. ప్రస్తుతం ఆ వీడియో స్థానిక టీవీ ఛానల్‌లో ప్రసారం కావడంతో తోపాటు ఆ జంట సెలబ్రిటీగా మారింది. ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్న ఆకాష్, ఐశ్వర్యల వివాహం సోమవారం జరపాలని పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. ప్రస్తుతం కేరళలో వర్షాలు, వరదల కారణంగా అది వీలుకాదని అనుకున్నారు. కానీ తమ జీవితంలో ముఖ్యమైన ఈ ఘట్టం తప్పిపోకూడదని , ఇది వాయిదా వేయడం ఇష్టం లేక ఆ నవ వధూవరులు ధైర్య సాహసాలతో వరద నీటిని దాటుకుంటూ తలవడి లోని ఫంక్షన్ హాలుకు చేరుకోగలిగారు. వివాహ వేదిక అంతా నీటితో నిండిపోయినా వారి నిర్ణయం మారలేదు. పరిమిత బంధువులు, అతిధులతో పెళ్లి జరిగింది. ఈ జంట చెంగనూర్ లోని దవాఖానాలో ఆరోగ్య కార్యకర్తలుగా పనిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News