Thursday, January 9, 2025

మద్యం తాగి ఆలస్యంగా పెళ్లి మండపానికి వచ్చిన వరుడు… వివాహాన్ని రద్దు చేసుకున్న వధువు

- Advertisement -
- Advertisement -

పాట్నా: ఓ వరుడు మద్యం తాగి పెళ్లి మండపానికి ఆలస్యంగా వెళ్లడంతో వధువు ఆ పెళ్లిని రద్దు చేసుకున్న సంఘటన బిహార్ రాష్ట్రం భాగల్‌పూర్ ప్రాంతంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం…. సుల్తాన్‌గంజ్‌కు చెందిన అమ్మాయి, మియాన్ అనే యువకుడికి పెళ్లి నిశ్చయించారు. మంగళవారం పెళ్లి ముహూర్తం నిశ్చయం చేయడంతో బంధువులు, వధువు పెళ్లి మండపానికి చేరుకున్నారు. వరుడు కోసం ఎదురు చూసిన రాకపోవడంతో వధువు కుటుంబీకులు ఆందోళన చెందారు. వరడు మద్యం మత్తులో పెళ్లి మండపానికి చేరుకున్నాడు. ఊగుతూ, తూగుతూ పెళ్లి మండపానికి చేరుకోవడంతో వధువు ఈ పెళ్లి వద్దని ఖరాఖండిగా చెప్పింది. దీంతో పెళ్లికి వచ్చిన బంధువులు అందరూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాజాగా ఫుల్‌గా మద్యం తాగి వరుడు పెళ్లి మండపంలో పడుకోవడంతో వధువు పెళ్లి రద్దు చేసుకున్న విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News